- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హరీశ్‌రావుది వన్‌సైడ్ లవ్.. ఆయనకు ప్రేమ లేదు! ఎంపీ చామల కిరణ్ కుమార్ హాట్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హరీశ్ రావు (Harish Rao) మీద ప్రేమ లేదు గానీ, హరీశ్ రావుకు (KCR) కేసీఆర్‌పై ప్రేమ ఉంది.. వన్‌సైడ్ లవ్ అది.. అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుని కాంగ్రెస్ పార్టీలోకి అహ్వానించే స్థాయి తనకు లేదని, హరీశ్‌రావు ఆలోచించుకుంటే ఎక్కడికైన వెళ్లొచ్చని, ఆయన వాళ్ల మామను వదిలి రాలేడని చెప్పుకొచ్చారు. ఇక, తెలంగాణను కేసీఆర్ నిలబెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పడగొట్టారని హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఎవరు పడగొట్టారు? ఎవరు నిలబెట్టారు? అని ఫైర్ అయ్యారు. మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్లిన వాళ్లు పడగొట్టినట్టా? అని ప్రశ్నించారు. పడిపోయిన రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, 200 యూనిట్ల కరెంట్, వడ్లకు రూ. 500 బోనస్, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు, రూ.500 సిలిండర్ ఇచ్చినవాళ్లు నిలబెట్టినట్టా ? అని నిలదీశారు. హరీశ్ రావు కళ్లుండి కూడా చూడలేని, చెవులుండీ కూడా వినలేని కబోది అని చామల విమర్శించారు.