- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video: ఇలాంటి సీన్ ఎప్పుడు చూసుండరు.. చిరుతను భయంతో పరుగులు పెట్టించిన కుక్క

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో ఎక్కువగా జంతువులకు (Animal) సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎక్కువగా ఆకట్టుకుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని పూర్తిగా భయానకంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇక తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
సాధారణంగా వన్యప్రాణుల్లో చిరుత (Leopard) పులిని చూస్తే మిగతా జంతువులు భయపడుతాయి. దగ్గరల్లో పులి కనిపిస్తే చాలు దాని కంట పడకుండా మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటాయి. కానీ, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఓ కుక్కకు (Dog) చిరుత భయపడి పరుగులు పెట్టింది. అర్థరాత్రి వేళ ఓ ఇంట్లోకి ప్రవేశించడానికి చిరుత పులి ప్రయత్నించింది. జాగ్రత్తగా అడుగులు వేస్తూ మెట్లు ఎక్కుతుండగా.. ఒక్కసారిగా బౌ.. బౌ అనే శబ్ధం వినిపించింది. ఇక అంతే సంగతి.. చిరుత వెనక్కి కూడా తిరిగి చూడకుండా పరుగులు పెట్టింది. ఇది ఏ ప్రాంతానికి చెందిన వీడియో క్లిప్ అనేది తెలియదు కానీ, నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు కుక్క డేర్‌నెస్‌ను తెగ మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.