- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కిష్కింధపురి’ ఫస్ట్ గ్లింప్స్ రాబోతుందంటూ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్.. సుస్సు పోయిస్తున్న పోస్టర్

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) ప్రస్తుతం ‘భైరవం’(Bhairavam) మూవీతో పాటు ‘కిష్కింధ పురి’(Kiskindhapuri) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘చావు కబురు చల్లగా’ డైరెక్టర్ కౌషిక్ పెగల్లపతి(Koushik Pegallapathi) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి టైటిల్ గ్లింప్స్ ఏప్రిల్ 29న రాబోతుందని తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇక ఆ పోస్టర్‌ను గమనించినట్లయితే.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ చేతిలో దీపాలను పట్టుకుని టెన్షన్‌గా దేనికోసమో వెతుకున్నారు. అలాగే బ్యాక్ గ్రౌండ్‌లో పాతబడ్డ బంగ్లా ఉంది. అంతేకాకుండా మొత్తం కాలిపోయిన చెట్ల కొమ్మలతో పోస్టర్ చాలా భయంకరంగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.