- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు...
దిశ,కార్వాన్ : ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులను అడ్డుకున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదు అయింది. మాసబ్ ట్యాంక్ పోలీసులు 3సార్లు విచారణకు పిలిచారు. విచారణకు రాకపోవడంతో గురువారం అదుపులోకి తీసుకొని మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో, వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి, మాసబ్ ట్యాంక్ పీఎస్ కు తరలించారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రవల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ వచ్చి ఎర్రోళ్ల శ్రీనివాసు ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. మధ్యాహ్నం కోర్టులో వాదనలు విన్న కోర్టు, శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ లో రూ.5 వేల పూచికత్తుతో పాటు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని, విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పిఎస్ వద్దకు చేరుకున్నారు.