హైదరాబాద్‌లో మరో స్టూడెంట్ ఆత్మహత్య

by srinivas |   ( Updated:2024-12-26 16:56:40.0  )
హైదరాబాద్‌లో మరో స్టూడెంట్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో స్టూడెంట్ బలవన్మరణానికి పాల్పడ్డారు. పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థి దీప్తి.. నాచారం సరస్వతి కాలనీలో ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని తెలుస్తోంది. తన తండ్రిపై కేసు వ్యవహారంలో తనను ఇబ్బంది పెట్టి వేధించారని దీప్తి ఇప్పటికే ఆరోపణలు చేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్యార్థి దీప్తి ఆత్మహత్యతో ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనను వేధించడం వల్లే దీప్తి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. దీప్తి మృతి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed