True love: రోగనిరోధక శక్తిని పెంచుతోన్న నిజమైన ప్రేమ.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.?

by Anjali |
True love: రోగనిరోధక శక్తిని పెంచుతోన్న నిజమైన ప్రేమ.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే ఈ ఫుడ్ తీసుకోవాలి.. ఈ డ్రింక్స్ తాగాలంటూ చెబుతుంటారు. వీటితో పాటుగా రోగనిరోధక శక్తి(Immunity power) పెరగాలంటే ప్రేమ కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. తాజాగా ఓహియో స్టేట్ యూనివర్సీటి(Ohio State University)లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం చూసినట్లైతే.. మనం తినే ఫుడ్ కన్నా.. మన మానసిక పరిస్థితి బాగుంటే ఆటోమేటిక్‌గా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అధ్యయనంలో రుజువు అయ్యింది. ఈ ప్రయోగం ఎలుకల మీద చేశారు. ఎలుకలకు చెడు ఆహారాన్ని తినిపించారు. ఇందులో ప్రేమతో పెరిగిన ఎలుకలు దాని ప్రభావాలను ప్రతిఘంటించాయి. ప్రేమను పొందని ఎలుకలు చెడు ఆహారంతో ప్రభావితమయ్యాయి.

దీంతో ప్రేమ ఉంటే దేన్నైనా తట్టుకోగల శక్తి ఉంటుందని మరోసారి అధ్యయనమే నిరూపించింది. కాగా ప్రియమైన వ్యక్తులతో సంతోషంగా ఉన్నప్పుడు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వారి స్పర్శ ఆందోళన, ఒంటరి తనం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా యాంగ్జయిటీ(Anxiety), డిప్రెషన్(depression,), స్ట్రెస్(stress) నుంచి రిలీఫ్ ను ఇస్తుంది. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడం, గడపడం ద్వారా బాధ నుంచి కూడా బయటపడొచ్చు. వారిని కౌగిలించుకుంటే మనస్సు తేలికగా ఉంటుంది. ప్రియమైనవారి స్పర్శ డోపమైన్ హార్మోన్(Dopamine hormone) రిలీజ్ ను పెంచుతుందని ఇటీవల కొలంబియా యూనివర్సిటీ(Columbia University) నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

Next Story

Most Viewed