భర్తపై కోపంతో టవర్ ఎక్కిన భార్య.. ప్రాణాలు కాపాడిన పోలీస్ పై ప్రశంసలు

by Ramesh Goud |   ( Updated:2025-03-19 13:09:14.0  )
భర్తపై కోపంతో టవర్ ఎక్కిన భార్య.. ప్రాణాలు కాపాడిన పోలీస్ పై ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: భర్తపై కోపంతో టవర్ ఎక్కిన మహిళ ప్రాణాలను ఓ పోలీస్ సాహసం చేసి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉత్తర ప్రదేశ్ (Uttarapradesh) లోని ప్రయాగ్ రాజ్ (Prayag Raj) కు చెందిన ఓ మహిళ తన భర్తతో వాగ్వాదానికి దిగింది. ఇది కాస్త ముదరడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆత్మహత్య (Suicide) చేసుకోవాలనే ఉద్దేశంతో పొలాల్లో ఉన్న ఎలక్ట్రిక్ టవర్ (Electric Tower) ఎక్కింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళకు నత్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేశారు. అయినా సరే ఫలితం లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ పోలీసు సహసం (Courage) చేశాడు.

ఆమెను కాపాడేందుకు వేగంగా టవర్ ఎక్కడం ప్రారంభించాడు. మహిళ టవర్ చివరికి చేరుకునే లోపు అతి వేగంగా టవర్ పై పాకుతూ.. ఆమె వద్దకు చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన ఆ మహిళను కిందికి దించి, ప్రాణాలు కాపాడాడు. అనంతరం పోలీసులు భార్యభర్తలకు కౌన్సిలింగ్ (Councelling) ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ సంఘటనను ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో (Video) కాస్త వైరల్ (Viral) గా మారింది. ఈ వీడియోలో మహిళను కాపాడేందుకు ఆ పోలీస్ చేసిన సహసానికి ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ పోలీస్ చేసిన సహాసాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. శభాష్ పోలీస్ అని, ఇలాంటి వారికి అవార్డులు (Awards) ఇచ్చి ప్రోత్సహించాలని కామెంట్లు పెడుతున్నారు.

Next Story

Most Viewed