- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పై కారు బీభత్సం..

దిశ, గండిపేట్ : మితిమీరిన వేగంతో డివైడర్ ను ఢీ కొట్టి మరో కారును ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న జైలో కారు నార్సింగ్ వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వైపు వెళ్తున్న టాటా సఫారీ కారణం ఢీ కొంది. దీంతో క్యాబ్ డ్రైవర్ శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా మృతి చెందినట్లు గుర్తించారు. క్యాబ్ లో ప్రయాణిస్తున్న ఐదు మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. హుటాహుటిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన రెండు కార్లు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది.