- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Weather Alert : రాష్ట్రంలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు

దిశ, వెబ్ డెస్క్ : తీవ్ర ఎండ నుంచి గత వారం రోజులపాటు ఉరుములు, వడగళ్ల వానల(Hailstroms)తో ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. అయితే నేటి నుంచి సూర్యుడు మళ్ళీ తన ప్రతాపాన్ని మొదలు పెట్టాడు. గురువారం పలు జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు(Increase Temperatures) నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది. రానున్న మరో నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సియస్ నుండి 44 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా వేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి మరియు వనపర్తి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ఆయా జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 36 డిగ్రీ సెల్సియస్ నుండి 40 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉంటాయని అంచనా వేసింది.