AFC Asian Cup: మా తుజే సలామ్.. మేఘాలయ బాలికల పాటకు నెటిజన్లు ఫిదా

by Ramesh N |
AFC Asian Cup: మా తుజే సలామ్.. మేఘాలయ బాలికల పాటకు నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Shillong) షిల్లాంగ్ జేఎన్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఏఎఫ్‌సీ (ఫుట్ బాల్) ఆసియా కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్‌కు ముందు చిన్న వేడుక నిర్వహించారు. అందులో భాగంగా (Meghalaya Girls Sing) మేఘాలయకు చెందిన యువతుల సంగీత బృందం అందరినీ ఆకర్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ పాడిన ఐకానిక్ సాంగ్ ‘మా తుజే సలామ్’ (Maa Tujhe Salam) పాట పాడి స్టేడియంలో అందరికీ గూస్‌‌బంప్స్ వచ్చేలా చేశారు. చిన్నారులు, బాలికలు ఇచ్చిన ఆ ప్రదర్శనతో ఇంటర్నెట్‌‌లో వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు సైతం ఆ మేఘాలయ యువతుల పాటకు ఫిదా అయ్యారు.

మేఘాలయలోని వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలోని నాంగ్‌స్టోయిన్‌లోని (KHMIH) క్రియేటివ్ సొసైటీ నుంచి ఈ సంగీత బృందం వచ్చింది. మేఘాలయ సాంప్రదాయ దుస్తులైన జాన్సెన్‌ను ధరించి వారి ప్రదర్శన ఇవ్వడంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యా మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ , నటి దియా మీర్జా సహా అనేక మంది ప్రముఖులు వారిపై ప్రశంసలు కురిపించారు.



Next Story

Most Viewed