ఇలాంటి పనులు చేసే ముందు మినిమమ్ కామన్ సెన్స్ వాడండి.. డైరెక్టర్ సంచలన ట్వీట్

by Hamsa |
ఇలాంటి పనులు చేసే ముందు మినిమమ్ కామన్ సెన్స్ వాడండి.. డైరెక్టర్ సంచలన ట్వీట్
X

దిశ, సినిమా: గత కొన్ని రోజుల నుంచి ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినప్పటికీ విడుదలైన రోజే ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇక పైరసీ కారణంగా చాలామంది దర్శక నిర్మాతలు చాలా నష్టపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది కేడీలు మారడం లేదు. ఇదే విధంగా షూటింగ్ జరుగుతున్న సినిమాల నుంచి కూడా పలు అప్డేట్స్ ముందుగానే లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. మేకర్స్ అప్డేట్స్ ఇవ్వకముందే లీక్ అవుతుండటంతో దర్శకులు తలలు పట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ముందు లీక్ కావడంతో మూవీపై అంత హైప్ కూడా ఉండటం లేదు. అయితే ఇప్పుడు ఓ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ కూడా లీక్ అయినట్లు సమాచారం. దీంతో ఈ విషయం డైరెక్టర్ స్పందించి సంచలన ట్వీట్ చేశారు.

అసలు విషయంలోకి వెళితే.. నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నాని (nani), శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబినేషన్‌లో ‘హిట్-3’ రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుండగా.. వాల్ పోస్టర్ సినిమాస్(Wall Poster Cinemas) బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. అయితే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక మే 1న విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి పలు ట్విస్టుల్ని కొంతమంది లీక్ చేసేశారు. దీంతో సోషల్ మీడియా మొత్తం అదే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, డైరెక్టర్ శైలేష్ కొలను ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ‘‘మన ప్రేక్షకులు సినిమాల్లో అనుభవించే ప్రతి ఒక్క ఎగ్జైటింగ్ మూమెంట్ కోసం.. మేం అంతా కూడా పగలు రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడుతుంటాం.. శారీరక సామర్థ్యాలకు మించి కష్టపడి పనిచేస్తుంటాం. ఇవన్నీ మేము ఆడిటోరియంలో సృష్టించాలనుకునే ఆ ఎఫెక్ట్ కోసం, రిజల్ట్ కోసం చేస్తుంటాం. అందులోనే మాకు గర్వకారణం ఉంటుంది.

ప్రస్తుతం మీడియా ఉన్న దుస్థితిని చూస్తే ఎంతో బాధగా అనిపిస్తుంది..మీడియాలోని కొంత మంది అసలు విషయాన్ని లీక్ చేసే ముందు క్షణం కూడా ఆలోచించడం లేదు.. థియేటర్లో ఆ మూమెంట్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేయాలని మేం ఎంతో కష్టపడి సినిమా తీస్తే.. ప్లాన్ చేస్తే వాటిని ఇలా లీక్ చేసి చెడగొట్టేస్తున్నారు.. ఫస్ట్ రిపోర్ట్ చేయాలనే మీ కర్తవ్యం గురించి మాకు తెలుసు.. అలా అని ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్నవి లేకుండా ఇలా ఏది లీక్ చేయాలి. ఏది లీక్ చేయకూడడు? అన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదా? ఇలా చేయడం తప్పా? రైటా? అన్నది మీరే ఆలోచించుకోండి.. ఒకప్పుడు గొప్ప విలువలతో కూడిన జర్నలిజం ఉండేది.. చాలా తెలిసినా వాటిని బయటకు చెప్పేవారు కాదు.. అది ఎథిక్స్ అంటే.. ఇలా లీకులు చేయడం అంటే.. మా నుంచి దొంగతనం చేసినట్టు కాదు.. నేరుగా ఆడియెన్స్‌ నుంచి, వారి ఎగ్జైట్మెంట్‌ను దొంగిలించినట్టే’’ అని రాసుకొచ్చారు.

Next Story

Most Viewed