- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP News:మత్స్యకారులకు గుడ్ న్యూస్.. ఆ రోజే అకౌంట్‌లో రూ.20 వేలు జమ

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం చంద్రబాబు(CM Chandrababu) శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ(YCP) హయాంలో మత్స్యకార భృతి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పడితే మత్స్యకార భృతి రూ.20 వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మత్స్యశాఖ(Department of Fisheries) రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున చేపల వేట నిషేధ భృతి అందజేయనున్నారు. అనంతరం రాష్ట్రం(Andhra Pradesh)లోని లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.20 వేలు జమ అవుతాయి. అయితే.. సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఈ నెల(ఏప్రిల్) 14 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ తరుణంలో మత్స్య కారులను ఆదుకోవడానికి ప్రభుత్వం కొన్నేళ్లుగా భృతిని అందజేస్తున్న విషయం తెలిసిందే.