నేను మొదటి సారి నటించిన సినిమాను ఇప్పుడు చూసినప్పుడు సిగ్గేస్తుంది.. నాగ చైతన్య మూవీపై సమంత షాకింగ్ కామెంట్స్

by Kavitha |
నేను మొదటి సారి నటించిన సినిమాను ఇప్పుడు చూసినప్పుడు సిగ్గేస్తుంది.. నాగ చైతన్య మూవీపై సమంత షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల ముద్దుగుమ్మ సమంత(Samantha) ‘శుభం’ మూవీతో నిర్మాతగా పరిచయం కానుంది. ఈ ముద్దుగుమ్మ సొంతంగా ట్రలాలా బ్యానర్(Tralala Banner) నిర్మించిన విషయం తెలిసిందే. తన సొంత బ్యానర్ నుంచి మొదటగా ‘శుభం’(Subham) అనే తొలి సినిమా విడుదల కానుంది. ఇక ఆ చిత్రం మే 9న రిలీజ్ కానుండగా అప్పుడే నటీనటులతో కలిసి తాను కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఓ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ నేను నటించిన మొదటి రెండు సినిమాలు నేను ఇప్పుడు చూసుకుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది.

నేను అంతకంటే బాగా యాక్ట్ చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా యాక్టింగ్ నాకే నచ్చలేదు. నేను నిర్మించిన శుభం మూవీలో అందరూ కొత్త నటీనటులే. అయిన కూడా వాళ్లు చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు. వాళ్ల యాక్టింగ్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఒక ఎమోషనల్ కథ ఆధారంగా తెరకెక్కిన మా శుభం సినిమాను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నేను నమ్ముతాను.

ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా సామ్ నటించిన ఫస్ట్ మూవీ ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave). ఇక ఈ మూవీలో తన మాజీ భర్త నాగ చైతన్య(Naga Chaitanya) హీరోగా నటించగా.. ఈ మూవీతోనే వీరి ప్రేమాయణం స్టార్ట్ అయి పెళ్లి, విడాకుల వరకు వెళ్లింది.



Next Story

Most Viewed