ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో పైసల వరద.. మంచి నీళ్లలా ఫ్రాంఛైజీల ఖర్చు

by Mahesh |   ( Updated:2025-03-20 12:35:28.0  )
ఐపీఎల్ ప్రీమియర్ లీగ్‌లో పైసల వరద.. మంచి నీళ్లలా ఫ్రాంఛైజీల ఖర్చు
X

దిశ, స్పోర్ట్స్: 1983లో భారత క్రికెట్ జట్టు తొలి సారి వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆ సమయంలో టీమ్ ఇండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు రూ.1,500. అదనంగా రూ.600 డీఏ వచ్చేది. అది కూడా మూడు రోజులకు ఒక సారి. వరల్డ్ కప్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభిస్తే ఒక షాంపైన్ బాటిల్ ఇచ్చేవారు. అంతకు మించి ఏవీ అందేవీ కావు. కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడుతున్న అనామక ఆటగాడు కూడా రూ.లక్షల్లో సంపాదిస్తున్నాడు. అదే స్టార్ ప్లేయర్లు అయితే రూ.కోట్లు చెల్లించడానికి కూడా వెనకాడటం లేదు. యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా రూ.27 కోట్ల చెల్లించి కొనుక్కుంది. శ్రేయస్ అయ్యర్‌కు రూ.26.75 కోట్లు, వెంకటేశ్ అయ్యర్‌కు రూ.23.75 కోట్లు, హెన్రిచ్ క్లాసెన్‌కు రూ.23 కోట్లు చెల్లిస్తున్నాయి ఆయా ఫ్రాంచైజీలు. ప్రపంచంలో ఏ జాతీయ క్రికెట్ జట్టు కోసం ఆడినా.. ఏడాదికి ఇంత జీతం రాదు. కానీ 65 రోజుల పాటు జరిగే ఐపీఎల్ ఆడితే చాలు డబ్బే డబ్బు.

మారిన బీసీసీఐ రాత..

ప్రపంచ క్రికెట్‌లోకి పెట్టుబడిదారులు ప్రవేశించిన తర్వాత ఆయా బోర్డుల ఆస్తులు, నగదు నిల్వలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా బ్రాడ్‌కాస్టర్లు, స్పాన్సరర్లు పోటీలు పడి మరీ డబ్బులు చెల్లిస్తుండటంతో క్రికెట్ ఒక మనీ గేమ్‌లా మారింది. ఇక ఐపీఎల్ రాకతో బీసీసీఐ మిగిలిన బోర్డుల కంటే మరో మెట్టుపై నిలిచింది. ఈ క్రికెట్‌ లీగ్‌ను బోర్డు ఉనికి కోసం ప్రారంభించినా.. ప్రస్తుతం బంగారు గుడ్లు పెట్టే బాతులా మారింది. అందుకే గతంలో కరోనా పేరుతో ఐసీసీ టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్‌లు వాయిదా పడినా.. ఐపీఎల్ మాత్రం ఆగలేదు. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఈ క్యాష్ రిచ్ లీగ్ నిరాటంకంగా సాగిపోయింది. 2008లో తొలి సారి ఫ్రాంచైజీలను వేలం వేశారు. ఒక్కో ఫ్రాంచైజీ బేస్ ధర 50 మిలియన్ డాలర్లుగా బీసీసీఐ నిర్ణయించింది.

111.90 మిలియన్ డాలర్లు చెల్లించి ముంబై ఇండియన్స్ జట్టును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును 111.60 మిలియన్ డాలర్లకు వ్యాపారవేత్త విజయ్ మాల్యా, డెక్కన్ చార్జర్స్‌ను 107 మిలియన్లకు డెక్కన్ క్రానికల్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఎనిమిది ఫ్రాంచైజీల వేలంతో బీసీసీఐ ఖాతాలో ఏకంగా 723.59 మిలియన్ డాలర్లు వచ్చి చేరాయి. అప్పటి డాలర్ రేటు ప్రకారం దీని విలువ రూ.3,560 కోట్లు. ఇక ఆటగాళ్లను అయితే ఆయా ఫ్రాంచైజీలు పోటీలు పడి మరీ కొనుగోలు చేశాయి. అపపట్లో ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.6 కోట్లు వెచ్చించింది. ఇలా డబ్బులను నీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తూ రూ.వేల కోట్లు ధారపోశాయి.

పైకి ఒక రేటు.. లోపల మరో రేటు..?

ఐపీఎల్‌లో ఆటగాళ్ల కొనుగోలు కోసం ఎంత ఖర్చు చేయాలనే విషయమై బీసీసీఐ ఒక నిబంధన విధించింది. దీన్నే పర్స్ వాల్యూ అని అంటారు. అప్పట్లో దీని విలువ రూ.82 కోట్లుగా నిర్ణయించారు. కానీ ప్రస్తుతం ఈ పర్స్ వాల్యూ రూ.120 కోట్లకు చేరింది. ఆయా ఫ్రాంచైజీలో ఆటగాళ్ల కొనుగోలుకు పర్స్ వాల్యూ ను మించి వాడే అవకాశం ఉండదు. అయితే కొంత మంది ఆటగాళ్లు ఒకే ఫ్రాంచైజీ తరపున ఏళ్ల తరబడి ఆడుతున్నారు. అయితే, అధికారికంగా వాళ్ళ జీతాలు పెంచితే పర్స్ వాల్యూ రూ.120 కోట్లను మించిపోతుంది. అందుకే ఫ్రాంచైజీలు అడ్డదారులు తొక్కుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 18 సీజన్లుగా సీఎస్కే తరపున ఎంఎస్ ధోని ఆడుతున్నాడు. ప్రస్తుతం అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా తక్కువ జీతాన్నే అందుకుంటున్నాడు. అయితే సీఎస్కే మాతృసంస్థ ఇండియా సిమెంట్స్‌లో ధోనీకి డైరెక్టర్ హోదా కల్పించింది. ఆ హోదాలో ధోనీకి భారీ మొత్తమే అందుతుంది.

కానీ ఇది పర్స్ వాల్యూ లెక్కల్లోకి రాదు. ఇక విరాట్ కోహ్లీ తన సొంత బ్రాండ్ రాంగన్‌ను ఆర్సీబీ జట్టు ద్వారా ప్రమోట్ చేయిస్తున్నాడు. తన స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థనూ ఆర్సీబీతో జట్టు కట్టించాడు. రోహిత్ శర్మకు విలువైన బహుమతులను రిలయన్స్ సంస్థ అందిస్తుందని క్రికెట్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తుంటాయి. 2015లో ముంబై ఇండియన్స్ రెండో సారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఇందుకు ప్రతిఫలంగా రోహిత్‌కు రూ.30 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌ను బహుమతిగా అందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్‌కు వాటాలు ఉండేవి. ఆ ఫ్రాంచైజీని లలిత్ మోడీ బంధువు నడిపించేవాడు. కానీ, లలిత్ నిష్క్రమణ తర్వాత ఫ్రాంచైజీని అమ్మేశారు. ఇలా ప్రతి ఫ్రాంచైజీ తన ఆటగాళ్లకు అధికారికంగా ఇచ్చే జీతంతో పాటు అనధికారికంగా డబ్బులు, బహుమతులు, షేర్లు తదితర రూపాల్లో బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. మొత్తంగా ఈ పైసల లీగ్‌లో చూసే ప్రేక్షకుడు తప్ప.. మిగిలిన అందరూ డబ్బుల సంపాదనలో మునిగితేలుతున్నారు.

ఐపీఎల్‌లో టాప్-10 ఎర్నర్స్

1. రిషబ్ పంత్ - రూ.27.00 కోట్లు

2. శ్రేయస్ అయ్యర్ - రూ.26.75 కోట్లు

3. వెంకటేష్ అయ్యర్ - రూ.23.75 కోట్లు

4. హెన్రిచ్ క్లాసెన్ - రూ.23.00 కోట్లు

5. విరాట్ కోహ్లీ - రూ.21.00 కోట్లు

6. నికోలస్ పూరన్ - రూ.21.00 కోట్లు

7. రవీంద్ర జడేజా - రూ.18.00 కోట్లు

8. రుతురాజ్ గైక్వాడ్ - రూ.18.00 కోట్లు

9. జస్ప్రిత్ బుమ్రా - రూ.18.00 కోట్లు

10. సంజూ శాంసన్ - రూ.18.00 కోట్లు

పెట్టిన ఖర్చు వెనక్కి తెచ్చుకునేది ఎలా?

ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలను మెయింటైన్ చేయాలంటే రూ.కోట్లతో వ్యవహారం. ఆటగాళ్ల కొనుగోళ్లతోనే సరిపోదు. ఐపీఎల్ జరిగే సమయంలో ఆటగాళ్ల వసతి, రవాణా, ఇతర అనేక ఖర్చులు స్వయంగా ఫ్రాంచైజీలే భరిస్తాయి. ఐపీఎల్ లాభాల్లో కొంత వాటాను బీసీసీఐ ఫ్రాంచైజీలకు పంచిపెడుతుంది. అయినా సరే ఫ్రాంచైజీలు కూడా తమదైన మార్గాల్లో డబ్బు సంపాదిస్తాయి. ముఖ్యంగా క్రికెటర్ల అవుట్ ఫిట్‌లతో ఫ్రాంచైజీలు వ్యాపారాలు చేస్తాయి. ప్రతి ఆటగాడిపై 14 వరకు లోగోలు మనకు కనిపిస్తుంటాయి. వీటిపై దాదాపు రూ.150 కోట్ల వరకు సంపాదిస్తాయి. అసలు ఆటగాళ్లను చూస్తుంటే.. వాళ్లు ప్లేయర్లా? కదిలే అడ్వర్టైజింగ్ బోర్డులా అనే డౌట్ వస్తుంది. ఏయే కంపెనీతో ఎంత మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయాన్ని అధికారికంగా వెల్లడించక పోయినా.. ఒక్కో టీమ్ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఒక్కో బ్రాండ్ ఒక టీమ్‌కే పరిమితం కాకుండా నాలుగైదు టీమ్స్‌తో ఒప్పందాలు చేసుకున్నాయి.

ఆటగాళ్ల దుస్తులపై కనపడే లోగోల ద్వారానే తమ కంపెనీకి ఎక్కువ మైలేజ్ వస్తుందని భావించే సంస్థలు కూడా ఉన్నాయి. ప్రతీ ఫ్రాంచైజీకి ఒక్కో సంస్థ నుంచి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు లోగోల ద్వారానే లబ్ధి చేకూరుతుంది. ఆటగాడి దుస్తులపై స్థానాన్ని బట్టి లోగోల రేట్లు మారుతుంటాయి. కొన్ని జట్లకు ఈ లోగో ఆదాయం ద్వారా ఆటగాళ్ల జీతభత్యాలకు చెల్లించాల్సిన మొత్తం సమకూరుతుండటం విశేషం. ఒక్కో ఆటగాడి అవుట్ ఫిట్‌పైన ఛాతిపై మూడు లోగోలు, ఎడమ భుజంపై రెండు, కుడి భుజంపై రెండు, వెనకాల ఒకటి, ప్యాంటు ముందు ఒకటి, హెల్మెట్ నాలుగు వైపులా నాలుగు.. ప్యాడ్లపై, క్యాప్స్‌పై ఇలా ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికతే అక్కడ ఆయా కంపెనీల లోగోలు వేసుకోవడానికి స్థలాన్ని అమ్మకానికి పెట్టేశారు.

ఏ జట్టుకు ఎవరు స్పాన్సర్లు:

చెన్నై సూపర్ కింగ్స్ : ఎతిహాద్ ఎయిర్ వేస్, ఫెడెక్స్, గల్ఫ్ ఆయిల్, బ్రిటిష్ ఎంపైర్, రేజాన్ సోలార్, ఆస్ట్రల్ పైప్స్, ఈక్విటాస్, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, విజన్ 11, బాష్యం, సిటీ యూనియన్ బ్యాంక్, కోకాకోలా, ప్లే ఆర్, బోల్డ్ ఫిట్, హలో ఎఫ్ఎం, ఫీవర్ ఎఫ్ఎం,

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : ఖతార్ ఎయిర్‌వేస్, కేఈఐ వైర్స్ అండ్ కేబుల్స్, డెలివరీ, రిలయన్స్ జియో, పూమా, హింద్‌వేర్ ఇలాలియన్ కలెక్షన్, బోట్, కన్ఫార్మ్ టికెట్, బిర్లా ఎస్టేట్స్, నిప్పన్ పెయింట్స్, టాప్ విత్ జీపే, బిస్లెరీ, రాయల్ చాలెంజ్ డ్రింకింగ్ వాటర్, డ్రీమ్ 11, కింగ్‌ఫిషర్ ప్రీమియర్ పాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, జియో హాట్‌స్టార్, బిగ్ బాస్కెట్ నౌ, ఏఆర్ఎల్ టైర్స్, పేజాప్ బై హెచ్‌డీఎఫ్‌సీ, నౌకరి, హాంగ్యో, మనిపాల్ హాస్పిటల్స్, నవిటాస్ సోలార్, క్వాలిటీ, పెక్స్‌పో, కేపీటీ పైప్స్, హరికేన్ ఎనర్జీ డ్రింక్, ఐటీసీ మాస్టర్ ఛెప్, ఎన్‌వీవై ప్రైడ్ ఆఫ్ ఇండియా, అడ్వాన్స్ డెకొరేటివ్ లామినేట్స్, డ్యూరోఫ్లెక్స్, బోల్డ్ ఫిట్, ఫ్రిడో, కోటక్ లైఫ్, ఫివర్ ఎఫ్ఎం, 92.7 ఎఫ్ఎం

ముంబై ఇండియన్స్ : ఎల్‌కేఈ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్, డీహెచ్ఎల్, జియో, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఆస్ట్రల్ పైప్స్, స్కెచర్స్, ఉషా, జియో హాట్‌స్టార్, డ్రీమ్ 11, కాస్ట్రోల్, ఈబిక్స్ క్యాష్, బిస్లెరీ, కాస్పర్‌స్కై, ఎస్3 గ్రూప్, ఫియట్‌పే, ఫుజి యమా సోలార్, పోకెమాన్, బీకేటీ, రిలయన్స్ డిజిటల్, జీకే టీఎంటీ, బిగ్ యాంట్ స్టూడియోస్, రేడియో సిటీ, ఫివర్ ఎఫ్ఎం, 94.3 రేడియో వన్, బోల్డ్ ఫిట్, చుప్స్, సెంట్రిక్, ఫ్యాన్ కోడ్, పార్క్‌సన్స్ కార్టముండి, రియల్ క్రికెట్

సన్‌రైజర్స్ హైదరాబాద్ : డ్రీమ్ 11, బీకేటీ, కెంట్ మినరల్ ఆర్వీ వాటర్ ప్యూరిఫయర్, జియో, ఆల్‌సీజన్స్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, లుబి పంప్స్, అరుణ్ ఐస్ క్రీమ్, అవాన్ సైకిల్స్, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, రాంగన్, కాంపా, స్పిన్నర్ స్పోర్ట్స్ డ్రింక్, బిగ్ యాంట్ స్టూడియోస్, సిటీ యూనియన్ బ్యాంక్, అపొల్లో హాస్పిటల్స్, కింగ్ ఫిషర్ ప్రీమియమ్, ఎయిర్ ఏసియా, ఆర్కేజీ అగ్‌మార్క్ ఘీ, హెరిటేజ్, లూప్ ఇయర్ ప్లగ్స్, డ్రాపీ హబ్, ఫ్యాన్ కోడ్ షాప్,ప్లే ఆర్, ఫిల్మీ డైస్,

కోల్‌కతా నైట్ రైడర్స్ : డ్రీమ్ 11, బీకేటీ, ఆర్ఆర్ కేబుల్, జాయ్ పర్సనల్ కేర్, జియో, ఆకో, విక్రమ్ సోలార్, జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్, మనిపాల్ హాస్పిటల్, థమ్సప్, వీడోల్, సిక్స్5సిక్స్,

బిగ్ యాంట్ స్టూడియోస్, ఫ్యాన్‌కోడ్ షాప్, ఫివర్ ఎఫ్ఎం, 94.3 నాషా ఎఫ్ఎం, సంపర్క్

ఢిల్లీ క్యాపిటల్స్ : హీరో ఫిన్కార్ప్, డిపి వరల్డ్, ఆల్ సీజన్స్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, జిఎంఆర్, జియ, అకో, ప్యూమా, జె.ఎస్.డబ్ల్యు పెయింట్స్, ఎన్‌కామ్, డ్రీమ్ 11, లివ్‌ఫాస్ట్, బిస్లరీ, ఎబిక్స్, బిగ్ యాంట్ స్టూడియోస్, హరికేన్ ఎనర్జీ డ్రింక్, ఫ్యాన్‌కోడ్ షాప్, మెడ్యులెన్స్, ఫీవర్ ఎఫ్ఎం, జియో హాట్‌స్టార్

రాజస్థాన్ రాయల్స్ : ల్యూమినోజ్, బికెటి, నియోమ్, జియో, రెడ్ బుల్, యుబోన్, గోయల్ టిఎంటి, పూర్ణిమ యూనివర్సిటీ, డ్రీమ్ 11, ఈట్ ఫిట్, ష్నైడర్ ఎలక్ట్రిక్, బిస్లరీ, మోవాడో, ఈజ్‌మైట్రిప్, హెచ్‌ఎండీ, బిగ్ యాంట్ స్టూడియోస్, రియల్ క్రికెట్, ఎటర్నల్ హాస్పిటల్, ఫ్యాన్‌కోడ్ షాప్

పంజాబ్ కింగ్స్ : డ్రీమ్ 11, బికెటి, జియో, ఆల్ సీజన్స్ హ్యాండ్ రబ్, కెంట్ మినరల్ ఆర్వో, అవన్ సైకిల్స్, డాజ్లర్, హైలాండ్ నియో వీల్స్, కాంపా, ఫ్రీమాన్స్, క్షేమ జనరల్ ఇన్సూరెన్స్, పేటీఎం ఇన్‌సైడర్+పేటీఎం, పోలరాయిడ్, ఫ్యాన్ కోడ్, సిక్స్5సిక్స్

లక్నో సూపర్ జెయింట్స్ : గ్రీన్ ప్లై, బికెటి, జియో, ఎస్‌బిఐ లైఫ్, ఐ.ఎన్.ఎ. సోలార్, ఫ్రీమాన్స్, కాంపా, రియల్ క్రికెట్, ఎస్.జి. స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్, ది గిఫ్ట్ స్టుడియో, మిర్చి ఎఫ్ఎం, రేడియో సిటీ ఎఫ్ఎం, 94.3 బిగ్ ఎఫ్ఎం, ఫివర్ ఎఫ్ఎం, గాన,జాగ్రన్ ఎంగేజ్

గుజరాత్ టైటాన్స్ : డ్రీమ్ 11, టోరెంట్ గ్రూప్, బీకేటీ టైర్లు, జియో, ఆస్ట్రల్ పైప్స్, సిమ్పోలో సెరామిక్స్, ఆకో, ఈక్విటాస్, రేజోన్ సోలార్, జియో హాట్‌స్టార్, బిస్లరీ, హవ్మోర్ ఐస్ క్రీమ్, బోట్, హరికేన్ ఎనర్జీ డ్రింక్, బిగ్ యాంట్ స్టూడియోస్, ఎస్.జి. స్పోర్ట్స్, ఫ్యాన్‌కోడ్ షాప్, చుప్స్, వాలియంట్, హెచ్‌సిజి, మిర్చి, 94.3 మై ఎఫ్ఎం, జొమాటో బై డిస్ట్రిక్ట్.

Read More : IPL: బ్రాడ్‌కాస్టింగ్‌తో కాసుల వర్షం.. ఆ రైట్స్‌తో ఏకంగా రూ.కోట్లలో ప్రాఫిట్

Next Story

Most Viewed