ఫుల్‌గా తాగి వచ్చి డేవిడ్ వార్నర్‌ను బండ బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్.. నెట్టింట ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)

by Hamsa |   ( Updated:2025-03-25 11:38:54.0  )
ఫుల్‌గా తాగి వచ్చి డేవిడ్ వార్నర్‌ను బండ బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్.. నెట్టింట ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో నితిన్(Nithin), శ్రీలీల (Sree Leela)జంటగా నటిస్తున్నలేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్(David Warner), వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే ‘రాబిన్‌హుడ్’ మూవీ మార్చి 28న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ మార్చి 23న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘మైత్రి మూవీస్ నాకు సొంత బ్యానర్ లాంటిది. నేను వారి మొదటి చిత్రం శ్రీమంతడులో నటించాను. ఇప్పుడు రాబిన్ హుడ్‌లో నటించాను. నవీన్, రవి నాకు బిడ్డల్లాంటి వారు. ఇక ఈ చిత్రం మార్చి 28న విడుదల అవుతోంది. ఇప్పటికే ఎండలు స్టార్ట్ అయ్యాయి. మంచి వేసవిలో కుటుంబసమేతంగా చూసి ఆనందించి, ఆద్యంతం నవ్వుకునేలా ఓ మంచి సినిమాను చూడబోతోన్నారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మూవీ రాలేదే అని అనుకుంటారు.

రాబిన్ హుడ్ మళ్లీ నాలాంటి ఓ నటుడ్ని ఫుల్ కిక్‌తో అందిస్తోంది. అందరూ అదిదా సర్ ప్రైజు అని పాట అనుకుంటారు. కానీ వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చారు.. వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు.. రేయ్ వార్నర్.. దొంగ ముండా కొడుకు.. రేయ్ వార్నర్.. ఇదే వార్నింగ్.. రాబిన్ హుడ్ లాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, వెంకీ లాంటి దర్శకులతో మళ్లీ నటించాలని అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ ఫుల్‌గా తాగి వచ్చి అలా మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు.

Next Story