- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సుధాకర్ కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి అనిత హామీ

దిశ, వెబ్ డెస్క్: కరోనా కాలం(Corona period)లో మాస్క్ అడిగిన పాపానికి అనస్థీషియా డాక్టర్ సుధాకర్(Anaesthesia Dr. Sudhaka) ఏ విధంగా బలి అయ్యారో అందిరికీ తెలిసిందే. అయితే ఆయన తల్లి కావేరీబాయిని హోంమంత్రి అనిత(Home Minister Anita) శుక్రవారం పరామర్శించారు. విశాఖ(Visakha)లోని కావేరీబాయి ఇంటికి అనిత వెళ్లారు. ఆమెను అపాయ్యంగా పలకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మృతి ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. సుధాకర్ మృతికి సంబంధించిన కేసు విచారణపై కావేరీ బాయి ఆరా తీశారు. సుధాకర్ మృతిని గుర్తు చేసుకుని ఆమె భావోద్వేగానికి గురాయ్యారు. సీబీఐ(CBI) దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమెకు హోంమంత్రి భరోసా కల్పించారు. సుధాకర్ కేసు విచారణ అంశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కావేరీ బాయికి హోంమంత్రి అనిత ధైర్యం చెప్పారు.