- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆశారాం బాపు బెయిల్ పొడిగింపు

- పంచకర్మ థెరపీ కోసం ఆరు నెలల బెయిల్ కోసం పిటిషన్
- జూన్ 30 వరకు బెయిల్ ఇచ్చిన గుజరాత్ హైకోర్టు
- రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆశారాం
దిశ, నేషనల్ బ్యూరో: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూ మధ్యంతర బెయిల్‌ను మరో మూడు నెలల పొడిగిస్తూ గుజరాత్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 86 ఏళ్ల ఆశారాం 2013లో పాల్పడిన రేప్‌కు 2023లో కోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా, అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోవాలనే కారణంతో బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. సుప్రీంకోర్టు ఆయనకు మార్చి 31 వరకు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. అయితే ఇంకా చికిత్స పూర్తి కాలేదని, మరో ఆరు నెలల పాటు తన ట్రీట్మెంట్ కోసం బెయిల్ పొడిగించాలని గుజారత్ హైకోర్టును ఆశారాం బాపూ ఆశ్రయించారు. అయితే మూడు నెలల పాటు పొడిగిస్తూ గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆశారాం బాపూ పంచకర్మ థెరపీ కోసం ఆరు నెలల సమయం పడుతుందని, డాక్టర్లు కూడా అదే సజెస్ట్ చేస్తున్నారని ఆయన తరపు లాయర్లు వాదించారు. అయితే ఆ థెరపీకి 90 రోజుల సమయం సరిపోతుందనే వాదనతో గుజరాత్ హైకోర్టు ఏకీభవించింది.
గుజరాత్ హైకోర్టులోని జస్టిస్ ఇల్లేశ్ వోరా, జస్టిస్ సందీప్ భట్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌లోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలను వెలువరిచారు. బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ భట్ అంగీకరించలేదు. దీంతో జస్టిస్ ఏఎస్ సుపెహియా మూడో జడ్జిగా బెంచ్‌లో చేర్చబడ్డారు. ఆయన బెయిల్ పొడిగింపుకు అనుకూలంగా ఉండటంతో 2-1 తేడాతో ఆశారాం బాపుకు బెయిల్ పొడిగించారు. 86 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తికి తప్పకుండా వైద్య సహాయం అందాల్సిందే, ఆయన ట్రీట్మెంట్ కోసం బెయిల్ మంజూరు చేయడం సబబే అని జస్టిస్ సుపెహియా అన్నారు. ఆశారాం బాపును జోధ్‌పూర్ కోర్టు దోషిగా నిర్దారించింది. తన ఆశ్రమంలో పని చేసే ఒక టీనేజ్ అమ్మాయిపై రేప్ చేశాడన్న అభియోగాలను నిర్ధారించి, జీవిత ఖైదు విధించింది. గుజరాత్ హైకోర్టు కూడా ఒక శిష్యురాలిపై రేప్ చేసినట్లు నిర్ధారించింది. కాగా, ఆయనకు ఇప్పటికే పలుమార్లు వైద్య సహాయం పేరుతో పెరోల్స్ లభించాయి.