- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IPL 2025: ఒక్క మ్యాచుతోనే ఐపీఎల్ రికార్డులు బ్రేక్..

దిశ, వెబ్ డెస్క్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సన్ రైజర్స్ మ్యాచ్ (Sunrisers match) ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వేదికగా జరిగింది. ముందు నుంచి ఆరెంజ్ ఆర్మీ (Orange Army) పై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ.. నిన్న ఉప్పల్ స్డేడియంలో బ్యాటర్లు పరుగుల సునామీ (Tsunami of runs) సృష్టించారు. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన హైదరాబాద్ బ్యాటర్లు 20 ఓవర్లలో ఏకంగా 286 పరుగులు చేసి.. ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోరును నమోదు చేశారు. అలాగే హైదరాబాద్ ఖాతాలో నాలుగో 250 కంటే ఎక్కువ స్కోర్ ను నమోదు చేశారు. అనంతరం భ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్ కూడా ఉప్పల్ స్టేడియంలో సిక్సర్ల మోత మోగించారు. 287 పరుగుల భారీ లక్ష్యం ముందు ఉండటంతో తాము చేయాల్సిన అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. కానీ చివరకు భారీ లక్ష్య ఛేదనలో ఓటమి చవిచూశారు.
ఇదిలా ఉంటే SRH- RR మధ్య ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అనేక రికార్డులు బ్రేక్ కాగా.. సరికొత్త రికార్డులకు (new records) నిలయం అయింది. ఒకే మ్యాచ్ లో అత్యధికంగా 528 పరుగులు నమోదు అయ్యాయి. కాగా ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండవ అత్యధిక స్కోరు (Second highest score) గా నిలిచింది. అలాగే ఇరు జట్టు కలిపి 30 సిక్సర్లు, 51 ఫోర్లను కొట్టడం కూడా రికార్డుల్లోకి ఎక్కింది. అలాగే ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ చేసి.. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్ తరుఫున అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అలాగే SRH తరుఫున అరంగేట్రం మ్యాచ్ లో తొలి సెంచరీ సాధించిన ప్లేయర్ గా ఇషాన్ కిషన్ పేరు నమోదు చేసుకున్నాడు.