నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీక్‌ కలకలం! నాకు ఏ పాపం తెలియదు.. విద్యార్థిని ఆవేదన

by Ramesh N |
నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీక్‌ కలకలం! నాకు ఏ పాపం తెలియదు.. విద్యార్థిని ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో (10th Class Exam Paper Leak) పదో తరగతి తెలుగు పేపర్ లీక్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చీఫ్ సూపరిండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా ప్రశ్నపత్రం బయటికి రావడానికి ఓ విద్యార్థిని ఆరోపిస్తూ డిబార్ చేశారు. ఈ క్రమంలోనే డిబార్ అయిన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి తాజాగా స్పందించారు. పేపర్ లీక్‌పై తనకు ఏ పాపం తెలియదు.. అని స్పష్టం చేశారు. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న పేపర్ చూపించు.. లేదంటే రాయితో కొడతానంటూ బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో తనకు భయం వేసింది.. ఏం చేయాలో అర్థం కాక పేపర్ చూపించానని చెప్పారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, దయచేసి తన డిబార్‌ను రద్దు చేయాలని అధికారులను కోరారు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు.. దయచేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అధికారులను వేడుకున్నారు.

కాగా, నకిరేకల్ స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్షాకేంద్రంలో ఈ జరిగిన చోటు చేసుకుంది. శుక్రవారం పరీక్షాకేంద్రంలోకి వచ్చిన కొంతమంది ఒక విద్యార్థి దగ్గరున్న ప్రశ్న పత్రాలను ఫొటో తీసి.. అనంతరం ఆ ప్రశ్నలకు సమాధానాలు సేకరించి, వాటిని జిరాక్స్‌ తీయించి విద్యార్థులకు అందించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. తెలుగు పరీక్ష మొదలైన వెంటనే ప్రశ్నపత్రం బయటకు వచ్చిందనే ఎంఈవో ఫిర్యాదుపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Next Story