Jagadish Reddy: 'బయటకు వెళ్లిపోండి సర్' అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి వర్సెస్ మార్షల్స్

by Prasad Jukanti |
Jagadish Reddy: బయటకు వెళ్లిపోండి సర్ అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి వర్సెస్ మార్షల్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ నుంచి సస్పెన్షన్ కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఇవాళ అసెంబ్లీ వద్ద రచ్చ చేశారు. అసెంబ్లీకి (Telangana Assembly) రావొద్దని సూచించిన చీఫ్ మార్షల్ కరుణాకర్ తో వాగ్వాదానికి దిగారు. తనను అసెంబ్లీకి రావొద్దని స్పీకర్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని డిమాండ్ చేశారు. సభలో చేసిన వ్యాఖ్యల కారణంగా జగదీశ్ రెడ్డిని ఈ సెన్షన్ పూర్తి కాలం సభ నుంచి స్పీకర్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయినా జగదీశ్ రెడ్డి ఇవాళ అసెంబ్లీ లాబీకి వచ్చారు. దాంతో ఆయనను మార్షల్స్ (Marshals) అడ్డుకుని బయటకు వెళ్లాలని కోరారు. దాంతో ఇప్పటి వరకు నన్ను సస్పెండ్ చేస్తూ బులెటిన్ ఇవ్వలేదని తనను రావద్దని స్పీకర్ ఇచ్చిన బులిటెన్ చూపించాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ క్రమంలో చీఫ్ మార్షల్ తో జగదీశ్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన జగదీశ్ రెడ్డి అసెంబ్లీ ఇష్టారాజ్యంగా నడుస్తోందని, పద్ధతి ప్రకారం నడవట్లేదని విమర్శించారు. మేము కోర్టుకు వెళ్తామని భయంతోనే సస్పెండ్ చేసినట్లు బులెటెన్ ఇవ్వట్లేదని ఆరోపించారు.

Next Story