ఉద్యోగానికి వెళ్లిన వివాహిత అదృశ్యం

by Aamani |
ఉద్యోగానికి  వెళ్లిన వివాహిత అదృశ్యం
X

దిశ,మేడ్చల్ టౌన్ : వివాహిత అదృశ్యమైన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ దేశానికి చెందిన బినిత దేవి(28) తన భర్త చంద్ర బహదూర్ తో కలిసి మేడ్చల్ లో నివాసం ఉండేవారు. దేవి మేడ్చల్ చెక్ పోస్ట్ లోని కేఎంపీ బిస్కెట్ కంపెనీలో కార్మికురాలు పనిచేస్తూ ఉండేది.డిసెంబర్ 26న ఉద్యోగానికి వెళ్తున్నా నని ఇంట్లో నుంచి బయలుదేరింది. అప్పటినుండి ఇప్పటివరకు ఇంటికి రాకపోవడంతో భర్త చంద్ర బహదూర్ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed