K Annamalai: కొరడా దెబ్బలు తిని.. మొక్కులు చెల్లించుకున్న అన్నామలై

by Shamantha N |
K Annamalai: కొరడా దెబ్బలు తిని.. మొక్కులు చెల్లించుకున్న అన్నామలై
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ తమిళనాడు (TamilNadu) చీఫ్ కె. అన్నామలై (Annamalai) ఆరు కొరడా దెబ్బలు తిని దేవుడికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు తమిళనాడు ఆరుసార్లు తనను తాను కొట్టుకున్నారు. ఆకుపచ్చ ధోతీ ధరించి, చొక్కా లేకుండా మీడియా ప్రతినిధులు, బీజేపీ కార్యకర్తల మధ్య తెల్లటి కొరడాతో ఆయన కొట్టుకున్నారు. తమిళనాడుని పాలించడంలో డీఎంకే అసమర్థతకు తాను ప్రాయశ్చితం చేసుకుంటున్నట్లు తెలిపారు. అన్నామలై మొక్కులు తీర్చుకుంటున్నంత సేపు “సిగ్గు లేదా స్టాలిన్?”, “నిందితుడైన జ్ఞానశేఖరన్‌ను ఉరితీయండి” అనే నినాదాలు చేస్తూ.. ఆ ప్లకార్డులతో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. స్వీయ దండయాత్ర తర్వాత అక్కడే ఉన్న మీడియాతో అన్నామలై మాట్లాడారు. తమిళ సంస్కృతిని అర్థం చేసుకున్న ఎవరికైనా ఈ పద్ధతులు పురాతనమైనవి తెలుసని అన్నారు. “మనల్ని మనం శిక్షించుకోవడం, చాలా కఠినమైన ఆచారాల ద్వారా స్వీయం దండన మొదలైనవి తమిళ సంస్కృతిలో భాగం. ఇది ఏ వ్యక్తికి కాదు.. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకం. అన్నా యూనివర్శిటీలో ఏం జరిగిందనేది ఒక సాంపిల్ మాత్రమే. నా పూర్వీకులు ఈ మార్గంలోనే నడిచారు. అందుకే, నేను కూడా ఈ మార్గాన్ని ఎంచుకున్నా’’ అని ఆయన అన్నారు. డీఎంకే పాలనా పరమైన అసమర్థత వల్ల సామాన్యులు రోజురోజుకూ నష్టపోతున్నారని ఆయన అన్నారు. 2026లో డీఎంకేను ప్రభుత్వాన్ని గద్దె దింపి, కోల్పోయిన తమిళనాడు వైభవాన్ని తిరిగి పొందడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

చెప్పులు వేసుకోను..

గురువారం అన్నామలై (Annamalai) మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే ప్రభుత్వంపై పైర్ అయ్యారు. ‘‘డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను చెప్పులు వేసుకోను. అని లేకుండానే నడుస్తా. ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపం. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికల్లో విజయం సాధించేంతవరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి... మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని అన్నారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్‌ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానన్నారు. ఆ మాట ప్రకారమే శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన ఇంటి వద్ద బీజేపీ మద్దతుదారులు, మీడియా సమక్షంలో మొక్కు చెల్లించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed