- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND Vs AUS: నిలకడగా ఆడుతోన్న టీమిండియా.. యశస్వీ జైస్వాల్ సెంచరీ మిస్

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో భాగంగా మెల్‌బోర్న్ (Melbourne) వేదికగా జరుగుతోన్న బాక్సింగ్ డే (Boxing Day) టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత జట్టు నిలకడగా ఆడుతోంది. 6 వికెట్లు 311 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన కంగారు జట్టు 474 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో స్టీవ్ స్మిత్ (Steven Smith) (140) మెరుపు సెంచరీతో అదగొట్టాడు. సామ్ కాన్‌స్టాస్ (Sam Konstas) (60), ఉస్మాన్ ఖావాజా (Usman Khawaja) (57), మార్నస్ లబుషేన్ (Marnus Labuschagne) (72) హాఫ్ సెంచరీలు చేశారు. అదేవిధంగా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) త్రుటిలో హాఫ్ సెంచరీ (49) చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో జస్ర్పీత్ బుమ్రా (Jasrpeet Bumrah) 4 వికెట్లు, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 3, ఆకాశ్ దీప్ (Akash Deep) 2, వాషింగ్టన్ సుందర్ (Washington Sunder) ఒక వికెట్ నేలకూల్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలో షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5 బంతుల్లో 3 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. మరోవైపు క్రీజ్‌లో కుదురుకున్నట్లుగా కనిపించిన కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 24 పరుగులు చేసి కమిన్స్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్ 118 బంతుల్లో 82 పరుగులు చేసి దురదృష్టవశాత్తు లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుత్తం టీమిండియా 3 కీలక వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 85 బంతుల్లో 36 పరుగులు, ఆకాశ్ దీప్ పరుగులేమి చేయకుండా క్రీజ్‌లో ఉన్నారు. ఆసిస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 2 వికెట్లను తీశాడు.