- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Madhavaram Krishna Rao: ఆంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఎమ్మెల్యేలు : మాధవరం కృష్ణ రావు
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్ర ప్రజల(People of Andhra Pradesh) మనోభావాలను దెబ్బతీసేలా...రాజధాని హైదరాబాద్(Hyderabad)నగరం ప్రశాంతతను భగ్నం చేసేలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు(Madhavaram Krishna Rao) విమర్శించారు. ఆంధ్రోళ్లను, సినిమావాళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా అంటూ మాధవరం ఫైర్ అయ్యారు. ఈ ప్రాంత శాసస సభ్యుడిగా ఈ రకమైన ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీ వాళ్లే కాదు.. బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడిన సహించేది లేదన్నారు. శిక్షణ తరగతుల్లో ఆ పార్టీల ఎమ్మెల్యేలు నేర్చుకుంది ఇదేనా? అంటూ మండిపడ్డారు.
సినీ పరిశ్రమను ఆనాడు మాజీ సీఎం చెన్నారెడ్డి ఎంతో కష్టపడి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారన్నారు. సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారని గుర్తు చేశారు. హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్నారని, హైదరబాద్ నగరం మాదని.. నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన మాట్లాడితే ఊరుకునేది లేదని, అలాంటి వారిని నగరంలో తిరుగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో కేసీఆర్ సెటిలర్ల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి వారిలో విశ్వాసాన్ని నింపి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు.