CM Revanth: సినీ ఇండస్ట్రీ పెద్దలకు బిగ్ షాక్.. బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన

by Shiva |   ( Updated:2024-12-26 16:31:51.0  )
CM Revanth: సినీ ఇండస్ట్రీ పెద్దలకు బిగ్ షాక్.. బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో ఇక నుంచి బెనిఫిట్ (Benifit), ప్రీమియర్ షో (Premiere Show)లు ఉండబోవని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాలీవుడ్ (Tollywood) ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ (Assembly)లో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేశారు. అదేవిధంగా స్పెషల్‌గా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు.

అదేవిధంగా పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్‌ (Telangana Rising)లో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Film Industry) సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండలన్నారు. టెంపుల్ టూరిజం (Temple Tourism), ఎకో టూరిజం‌ (Eco Tourism)ను ప్రమోటు చేయాలన్నారు. శాంతిభ్రదల విషయంలో రాజీ లేదని పేర్కొన్నారు. ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్ ఉంటామని.. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Read More...

TG Govt.: సీఎంతో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ షురూ.. ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు


Advertisement

Next Story

Most Viewed