- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టు దుర్మార్గమైన చర్య: KTR
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తో పాటు ఎర్రోళ్ల శ్రీనివాస్(Errolla Srinivas)పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నోటీసు అందించడానికి పోలీసులు(police) గురువారం ఉదయం శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. అయితే అరెస్ట్(Arrest) చేస్తారనే సమాచారంతో శ్రీనివాస్ తన ఇంట్లో నుంచి బయటకు రాలేదు. దీంతో న్యాయవాదులతో కలిసి పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళారు. అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి.. మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఖండించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్వీట్‌లో "ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును దుర్మార్గమైన చర్య. హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్ట్‌లు చేస్తున్నారని తీవ్ర తన ట్వీట్‌లో స్థాయిలో మండిపడ్డారు. అలాగే ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్‌లకు భయపడేవారు ఎవరూ లేరని ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.