Startups: 16 లక్షల ఉద్యోగాలు కల్పించిన దేశీయ స్టార్టప్‌లు

by S Gopi |
Startups: 16 లక్షల ఉద్యోగాలు కల్పించిన దేశీయ స్టార్టప్‌లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో స్టార్టప్‌లు ఉపాధి సృష్టికి కీలక చోదకంగా మారుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీలు 16 లక్షల ఉద్యోగాలను కల్పించాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) బుధవారం ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ 25 నాటికి మొత్తం 1.57 లక్షల స్టార్టప్‌లు ఉండగా, ఇందులో కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ను కలిగిన 73,000 కంటే ఎక్కువ స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని డీపీఐఐటీ పేర్కొంది. లక్షల ఉద్యోగాలతో స్టార్టప్‌లు ఉపాధి కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ ఖర్చు తక్కువగా ఉండటం, యువత, పటిష్టమైన వర్క్‌ఫోర్స్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్, హెల్-టెక్, ఈ-కామర్స్ సహా భిన్న రంగాల్లో స్టార్టప్‌లు వృద్ధికి ఆజ్యం పోస్తున్నాయి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా ఉన్న భారత్, త్వరలో అగ్రగామి స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా ఎదగనుందని, ఇందుకు జనాభాతో పాటు ఆర్థిక, విధానపరమైన అంశాలు దోహదపడనున్నాయని డీపీఐఐటీ అధికారిక ప్రకటనలో వివరించింది. బైజూస్, జొమాటో, ఓలా, నైకా లాంటి స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించాయని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed