- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Arunish Chawla: రెవెన్యూ కార్యదర్శిగా అరుణిష్ చావ్లా.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర రెవెన్యూ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణిష్ చావ్లా (Arunish Chawla) నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా కేంద్రం నియమించడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం చావ్లాను అపాయింట్ చేసింది. దీంతో చావ్లా త్వరలోనే రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చావ్లా ప్రస్తుతం ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీగా ఉన్నారు. అయితే చావ్లా స్థానంలో కొత్త ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్ (Amith Agarwal)ను నియమించినట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన వినీత్ జోషిని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు.