విద్యుత్ షాక్ తో వివాహిత మృతి..

by Sumithra |
విద్యుత్ షాక్ తో వివాహిత మృతి..
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్దిపేట మండలం రాచర్ల గుండారం గ్రామానికి చెందిన సుద్దాల రేణా (35) అనే వివాహిత గురువారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. వివరాల్లోకెళితే సుద్దాల రేణా ఆమె భర్త బాలయ్య ఇద్దరూ వారి ఇంటి పక్కన గల ఖాళీ స్థలంలో కొత్తిమీర, అల్లం, ఎల్లిగడ్డ సాగుచేసుకున్నారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో సాగు చేసిన పంటలను కాపాడడం కోసం విద్యుత్ షాక్ పెట్టారు.

ఇది గమనించని రేణా కొత్తిమీర మడిలోకి వెళ్లి కొత్తిమీరకు నీళ్లు పారిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. రేణాకు భర్త బాలయ్య, కూతురు ప్రవళిక ఉన్నారు. విద్యుత్ షాక్ కు గురైన రేణాను మండల కేంద్రంలో గల ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. స్థానిక ఎస్సై నేరెళ్ల రమాకాంత్ సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed