ఈరోజు తెలుగు నిర్మాతలకు శుభదినం: అల్లు అరవింద్

by Mahesh |   ( Updated:2024-12-26 16:29:56.0  )
ఈరోజు తెలుగు నిర్మాతలకు శుభదినం: అల్లు అరవింద్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తో సినీ ప్రముఖుల (Movie celebrities) మీటింగ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఆఫీస్ లో జరిగింది. మొత్తం 46 మంది సినీ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరు కాగా.. ఇండస్ట్రీ తీసుకోవాల్సిన పలు చర్యలపై సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్(Allu Arvind) మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సంధ్య థియేటర్(Sandhya Theatre) లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. తెలుగు నిర్మాతల(Telugu producers)కు ఈరోజు శుభదినం(good day) అని, హైదరాబాద్ వరల్డ్ షూటింగ్‌ డెస్టినేషన్‌ కావడానికి.. ప్రభుత్వానికి సహకరిస్తామని ఈ సందర్భంగా అల్లు అరవింద్ భరోసా ఇచ్చారు.

Read More...

సినీ ప్రముఖుల ముందే సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన


Advertisement

Next Story

Most Viewed