- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సచివాలయ ఉద్యోగులకు షాక్.. బయోమెట్రిక్ విషయంలో కీలక ఆదేశాలు
దిశ, వెబ్ డెస్: సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి చేసింది. ఉదయం, సాయంత్రం ఉద్యోగులు బయోమెట్రిక్ చేయాలని ఆదేశించింది. ఈ హాజరుతో వారి జీతాలను లింక్ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సచివాలయాలశాఖ డైరెక్టర్ శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జీఎస్ డబ్ల్యూఎస్ యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకూ, వీఆర్వో గ్రేడ్ 1 ఇలా హాజరు వేయడం లేదని గుర్తించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని శివప్రసాద్ తెలిపారు. ఎనర్జీ అసిస్టెంట్, వీఆర్వో గ్రేడ్ 2, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5,గ్రామ సర్వేయర్ , వార్డు అడ్మిషన్ కార్యదర్శులు కూడా 30 శాతం నుంచి 50 శాతం మాత్రమే బయోమెట్రిక్‌కు హాజరు కాలేదని, ఇలా వీరంతా సరైన సమయానికి రాకపోవటం వల్ల ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆయన చెప్పారు. ఇదంతా తిరిగి జిల్లా యంత్రాంగంపై భారం పెంచుతుందని తెలిపారు. ఇకపై కలెక్టర్లు ఈ విషయంలో డీడీవోలు నిబంధనల మేరకు పని చేసేలా చూడాలని సచివాలయాలశాఖ డైరెక్టర్ శివప్రసాద్ కోరారు.