రాజన్న ఆలయంలో దొంగతనం..

by Sumithra |
రాజన్న ఆలయంలో దొంగతనం..
X

దిశ, వేములవాడ / వేములవాడ టౌన్ : ఇప్పటికే వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న వేములవాడ రాజన్న ఆలయం మరోసారి సంచలన ఇష్యూతో వార్తల్లో నిలిచింది. ఈసారి ఏకంగా కొంతమంది వ్యక్తులు సాక్షాత్తు గర్భాలయంలోని ఆలయ హుండీలకే కన్నం వేసి ఆలయ అధికారులకు, భద్రత సిబ్బందికి సవాల్ విసిరారు. దీంతో మరోసారి రాజన్న ఆలయం వివాదాస్పదంగా మారింది. ఇక వివరాల్లోకెళ్తే రాజన్న గర్భాలయంలో మొత్తం నాలుగు పెద్ద హుండీలు, ఎనిమిది చిన్న హుండీలు ఉన్నాయి.

ఇటీవల భక్తుల నుంచి నగదు, మొక్కుబడి కానుకలు పెరిగి హుండీలు నిండిపోయాయి. ఈ క్రమంలో బుధవారం ముగ్గురు మైనర్లు సాధారణ భక్తుల్లా రాజన్న ఆలయం లోపలికి వచ్చి, హుండీలోని నగదు దొంగిలిస్తూ ఆలయ సిబ్బందికి చిక్కారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి రూ.2800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పోలీసు విచారణలో ఆదివారం కూడా రూ.7 వేలు కాజేసినట్టు తెలిసింది. ఆలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్టు వేములవాడ పట్టణ ఇంచార్జీ సీఐ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement

Next Story