రూ.10 లక్షల దొంగలు రిమాండ్ కు తరలింపు

by Kalyani |
రూ.10 లక్షల దొంగలు రిమాండ్ కు తరలింపు
X

దిశ,మునిపల్లి ; గత వారం రోజుల క్రితం మండల పరిధిలోని బుదేరా చౌరస్తలోని తాజ్ రెస్టారెంట్ వద్ద ఆగి ఉన్న కారులో నుంచి రూ.10 లక్షలు దొంగలించిన వ్యక్తులను రిమాండ్ కు తరలించినట్లు సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ తెలిపారు. బుధవారం కొండాపూర్ పోలీస్ స్టేషన్ లో స్థానిక విలేకరులతో సమావేశం నిర్వహించి దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముంబై జాతీయ రహదారిపై గల తాజ్ రెస్టారెంట్ వద్ద వాహనం నిలిపి హోటల్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కార్లో నుంచి రూ.10 లక్షలు దొంగలించినట్లు డీఎస్పీ తెలిపారు. మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తా లోగల తాజ్ రెస్టారెంట్ వద్ద వారు వెళుతున్న కారు ఆపి లోపలికి వెళ్లి భోజనం చేస్తున్నా క్రమంలో గుర్తు తెలియని వారు కారు నుంచి రూ. పది లక్షలు తీసుకెళ్లినట్టు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

అందులో మండలంలోని బుదేరతొ పాటు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు చెక్ చేయగా కొంతమందిపై అనుమానం రావడంతో మహ్మద్ అలీ ఖురేషి, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ రహీం ఖాన్ ఆదిల్ లు ఓల్డ్ సిటీ, హైదరాబాద్ గా గుర్తించి వారిని పట్టుకుని విచారించగా బుదేరా తాజ్ రెస్టారెంట్ వద్ద చేసిన నేరం ను ఒప్పుకొని వారు దొంగలించిన, 10,00,000/- లను చూపించగా ఇద్దరు సమక్షంలో ఈ నగదును కొండాపూర్ సి ఐ డి వెంకటేష్ నేరస్తులను రిమాండ్కు తరలించారు. దొంగతనం కేసును చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన రామకృష్ణ హెడ్ కానిస్టేబుల్,పిఎస్ సిబ్బంది హనీఫ్, పాండు,సునీల్ లను సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ సీఐ వెంకటేష్, మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed