ఎమర్జెన్సీ విద్యుత్‌.. 28న గ్రిడ్ ఇండియా మాక్ ఎక్సర్‌సైజ్

by srinivas |
ఎమర్జెన్సీ విద్యుత్‌.. 28న గ్రిడ్ ఇండియా మాక్ ఎక్సర్‌సైజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో గ్రిడ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 28న మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహించనున్నారు. పవర్ సప్లయ్ పూర్తిగా ఫెయిలైన సందర్భాల్లో విద్యుత్ పునురద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యోగులు, సిబ్బందికి మాక్ ఎక్సర్‌సైజ్ ద్వారా అవగాహన కల్పించనున్నారు. అలాగే సిబ్బంది ఎంతమేరకు అలర్ట్ గా ఉన్నారనే అంశాలను పరిశీలించనున్నారు. ఈనెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ మాక్ ఎక్సర్‌సైజ్ జరగనున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఈ మాక్ ఎక్సర్‌సైజ్ ప్రతి ఏడాది నిర్వహించే కార్యక్రమమేనని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశముందని ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. ప్రధానంగా కౌటాల, మెట్‌పల్లి, మేడిపల్లి, కథలాపూర్, రాయికల్, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల్, వేములవాడ రూరల్, గంగాధర, రామడుగు, చొప్పదండి, నందగిరి ఫీడర్లలో 30 నిమిషాల పాటు సరఫరాకు అంతరాయం కలిగే అవకాశముందన్నారు. విద్యుత్ వినియోగదారులు దీనికి సహకరించాలని, వారికి కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని సీఎండీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed