- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naveen Patnaik: భారతరత్నపై ఆలోచనలేదు.. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్
దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా మాజీ సీఎం. బిజూ జనతా దళ్(BJD) చీఫ్ నవీన్ పట్నాయక్(Naveen Patnaik)కు భారతరత్న (Baratha Rathna) ఇవ్వాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన ప్రకటనపై నవీన్ పట్నాయక్ స్పందించారు. గిరిరాజ్ ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆయన.. భారతరత్న స్వీకరించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆ డిమాండ్ ఎందుకు చేశారో నాకు తెలియదని చెప్పారు. ప్రజల కోసం మరింత పని చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. బీజేడీ 28వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amith shah) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మరోవైపు గిరిరాజ్ సింగ్ ప్రకటనను బీజేడీ నేత అమర్ పట్నాయక్ (Amar Patnaik) స్వాగతించారు. ‘నవీన్ పట్నాయక్ గత 24 ఏళ్లుగా ఒడిశా ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. భారతరత్న పురస్కారం వస్తే స్వాగతిస్తాం. వచ్చినా రాకపోయినా నిరంతరం ప్రజల కోసమే పోరాడతాం’ అని తెలిపారు.