- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harvinder Singh: క్రీడా పురస్కారాల్లో వివక్ష.. : పారా అర్చర్ హర్విందర్ సింగ్
దిశ, స్పోర్ట్స్ : క్రీడా పురస్కారాల్లో వివక్ష చూపుతున్నారని పారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్, భారత అర్చర్ హర్విందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఆయన ఈ మేరకు స్పందించారు. ఖేల్ రత్న అవార్డుల జాబితాలో తమ పేర్లు లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశాడు. క్రీడల్లో వివక్ష కొనసాగుతోందని మండిపడ్డాడు. ‘2020 టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. 2024 పారిస్ పారాలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్‌ల పరిస్థితి ఏంటి? అవే పోటీలు, అవే గోల్డ్ పతకం, అదే గౌరవం, కానీ అవార్డు మాత్రం ఇవ్వలేదు.’ 2021లో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తరఫున స్వర్ణం గెలిచిన షూటర్ అవనీ లేఖ, జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా, సుమిత్, షట్లర్ ప్రమోద్ భగత్‌లకు ఖేల్ రత్న అవార్డుతో సత్కరించారు. జాతీయ అర్చరీ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత జివాన్ జోత్ సైతం ఈ అంశంపై స్పందించారు. టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన వారికి ఖేల్ రత్న అవార్డు ఇచ్చి సత్కరించారు. కేంద్రం ఆనాడు తీసుకున్న నిర్ణయం అథ్లెట్లలో స్ఫూర్తి నింపింది. హర్విందర్ సింగ్ విషయంలో వ్యక్తిగతం అధికారులను విజ్ఞప్తి చేస్తున్నా.. అతని విజయాలను పరిగణలోకి తీసుకుని ఖేల్ రత్న అవార్డుకు ఎంపిక చేయాలన్నారు.