Bandi Sanjay : రాహుల్ గాంధీ అభినందనలపై బండి సంజయ్ విసుర్లు

by Y. Venkata Narasimha Reddy |
Bandi Sanjay : రాహుల్ గాంధీ అభినందనలపై బండి సంజయ్ విసుర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రశంసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లేఖ (Praise Letter)రాయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. దేనికి భేష్‌..దేనికి శభాష్ అని.."మహాలక్ష్మి" పథకాన్ని మాయ చేసినందుకు భేష్ చెప్పరా లేక మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకునే అరాచక పరిస్థితికి శభాష్‌ చెప్పారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. "రైతు భరోసా" వాయిదాల దిశ అయినందుకు భేష్..

రైతుల చేతికి సంకెళ్లేసినందుకు శభాష్‌ తెలిపారా లేక "విద్యాభరోసా కార్డు" ఊసే ఎత్తనందుకు భేష్..విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నందుకు శభాష్‌ చెప్పారా అని నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు" ఇంకా రానందుకు భేష్..ఉన్న ఇండ్లు కూలగొడుతున్నందుకు శభాష్ అంటున్నారా అని, "చేయూత"గా రూ.4000 ఫించను అందనందుకు భేష్ చెప్పరా అని, ఇచ్చే ఫించన్లు కూడా ఆలస్యం చేస్తూ ఏడిపిస్తున్నందుకు శభాష్ అన్నారా అని బండి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఆశ లేదు..సంక్షేమం ఊసు లేదని, పనికొచ్చే పని లేదని, పనికిమాలిన డైవర్షన్‌ పాలిటిక్స్‌కు అడ్డులేదని, ఏం సాధించిందని తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు రాహుల్ గాంధీ శుభాభినందనలను చెప్తున్నాడని బండి సంజయ్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed