Bumrah : మరో రికార్డుపై బుమ్రా కన్ను.. 600 వికెట్లకు చేరువలో జడేజా

by Sathputhe Rajesh |
Bumrah :  మరో రికార్డుపై బుమ్రా కన్ను.. 600 వికెట్లకు చేరువలో జడేజా
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అదరగొడుతున్న భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా మరో రికార్డుపై కన్నేశాడు. 43 టెస్టుల్లో 194 వికెట్లు తీసిన బుమ్రా మరో 6 వికెట్లు పడగొడితే టెస్ట్‌ల్లో 200 వికెట్ల క్లబ్‌లో చేరతాడు. తద్వారా టెస్ట్‌ల్లో 200 వికెట్లు పడగొట్టిన 12వ బౌలర్‌గా నిలవనున్నాడు. బుమ్రా ఈ ఫీట్ సాధిస్తే 50 టెస్ట్ మ్యాచ్‌లు ఆడకముందే 200 వికెట్లు పడగొట్టిన తొలి భారత పేస్ బౌలర్‌గా నిలవనున్నాడు. బుమ్రా కన్నా ముందు కపిల్ దేవ్ 50వ టెస్ట్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా 21 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టాప్‌లో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాపై బుమ్రా ఇప్పటి వరకు మొత్తం 54 వికెట్లు పడగొట్టాడు.

600 వికెట్లకు చేరువలో జడేజా

రవీంద్ర జడేజా మరో ఏడు వికెట్లు పడగొడితే భారత్ తరఫున 600 వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత్ బౌలర్ గా జడేజా నిలుస్తాడు. జడేజా మొత్తం 349 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 29.04 యావరేజ్‌తో 593 వికెట్లు పడగొట్టాడు. 17 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. 42/7 అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆస్ట్రేలియాపై జడేజాకు మంచి రికార్డు ఉంది. 18 టెస్ట్‌ల్లో 20.35 యావరేజ్‌తో 89 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

Next Story

Most Viewed