Israel: వచ్చే ఏడాది భారతీయుల కోసం ఇజ్రాయెల్ ఈ-వీసా సౌకర్యం

by S Gopi |
Israel: వచ్చే ఏడాది భారతీయుల కోసం ఇజ్రాయెల్ ఈ-వీసా సౌకర్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య ఇజ్రాయెల్ ఈ ఏడాది భారతీయ పర్యాటకుల సంఖ్య 10,000కు చేరుతుందని ఆశిస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ప్రారంభంలో భారతీయుల కోసం ఈ-వీసా కార్యక్రమాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఓ అధికారి గురువారం ప్రకటనలో చెప్పారు. ఇజ్రాయెల్ పర్యాటక మంత్రిత్వ శాఖ ఇండియా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్, అమృత బంగేరా ప్రకారం.. ఈ సంవత్సరం అక్టోబర్ వరకు దాదాపు 8,500 మంది భారతీయ పర్యాటకులు ఇజ్రాయెల్‌ను సందర్శించారు. '2018లో ఇజ్రాయెల్ 70,800 మంది భారతీయ సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అప్పటివరకు అత్యధిక రికార్డు. కొవిడ్-19 మహమ్మారి ప్రపంచ పర్యాటకంపై ప్రభావం చూపడంతో సందర్శకులు తగ్గారు. 2022లో మళ్లీ భారతీయుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ ఏడాది 30,900 మంది పర్యాటకులు ఇజ్రాయెల్ వచ్చారని ' ఆమె వివరించారు. ఆ తర్వాత 2023లో 41,800 మంది పర్యాటకులు వెళ్లగా, ఈ ఏడాది యుద్ధ పరిస్థితుల వల్ల జనవరి-అక్టోబర్ మధ్య 8,500 మంది భారతీయులు పర్యటించారు. ఏడాది చివరి నాటికి భారతీయ పర్యాటకుల సంఖ్య దాదాపు 10,000కు చేరుకుంటుందని మేము ఆశిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed