Jeff Bezos: పెళ్లికి రూ. 5,000 కోట్ల ఖర్చు.. స్పందించిన జెఫ్ బెజోస్..!

by Maddikunta Saikiran |   ( Updated:2024-12-23 06:32:08.0  )
Jeff Bezos: పెళ్లికి రూ. 5,000 కోట్ల ఖర్చు.. స్పందించిన జెఫ్ బెజోస్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ రెండో సంపన్నుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు(Amazon Founder) జెఫ్ బెజోస్(Jeff Bezos) రెండోసారి వివాహానికి సిద్దమైన విషయం తెలిసిందే. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్(Lauren Sanchez)ను ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు ఆదివారం వెల్లడించాయి. కొలరాడో(Colorado)లోని ఆస్పెన్‌(Aspen)లో కొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఈ నెల 28న వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పెళ్ళికి బెజోస్ ఏకంగా 600 మిలియన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 5,000 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న కథనాలపై బెజోస్ తాజాగా స్పందించారు. పెళ్లికి 600 మి.డా ఖర్చు చేస్తున్న మాట అవాస్తమని తేల్చి చెప్పారు. ఈ మేరకు 'ఎక్స్(X)' వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 'పెళ్లికి అంత మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ అసత్య ప్రచారాలే. అలాంటిదేమి జరగట్లేదు. చదివేవన్నీ నిజం కావని అనేందుకు ఇదో ఉదాహరణ. నిజం తన ప్యాంట్‌ను ధరించకముందే అబద్ధాలు ప్రపంచమంతటా చుట్టేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని నమ్మకూడదు' అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed