కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని ఆపకపోతే.. లక్ష మందితో HYDలో సభ నిర్వహిస్తాం

by Gantepaka Srikanth |
కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని ఆపకపోతే.. లక్ష మందితో HYDలో సభ నిర్వహిస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt)పై బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గౌడ కులస్థులను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto)లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారని అన్నారు. కల్తీ కల్లు అంటూ అనేక జిల్లాల్లో దాడలకు పాల్పడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కల్లు దుకాణాలు తెరిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మూసేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. కేవలం మూడు శాతం మందే రాష్ట్రంలో కల్లు సేవిస్తారని తెలిపారు.

రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పాలను కల్తీ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. వైన్ షాపులలో గౌడ సోదరులకు పెంచుతామన్న రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచలేదు. గీత కార్మికులకు ప్రమాదశావత్తూ మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం లేదు. ట్యాంక్ బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెడతామని పెట్టలేదు ఇలా అనే హామీలను విస్మరించిందని అన్నారు. రాష్ట్రంలో కల్లు దుకాణాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దాడులు ఆపకపోతే త్వరలోనే లక్ష మందితో హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed