Stock Market: కేంద్ర బడ్జెట్-2025 రోజున పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock Market: కేంద్ర బడ్జెట్-2025 రోజున పనిచేయనున్న స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ సూచీలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) 2025, ఫిబ్రవరి 1న కూడా పనిచేయనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా స్టాక్ మార్కెట్లు ఆరోజున తెరిచే ఉంటాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు ప్రకటించాయి. ఈ మేరకు సోమవారం సర్క్యులర్ విడుదల చేశాయి. బడ్జెట్ రోజున మార్కెట్లను తెరిచి ఉంచడం కొత్త కాదు. గతంలో, బడ్జెట్ ప్రకటనలకు సంబంధించి మార్కెట్ల స్పందనను సులభతరం చేసేందుకు 2020, ఫిబ్రవరి 1, 2015, ఫిబ్రవరి 28(శనివారం) తేదీల్లో స్టాక్ మార్కెట్లు పనిచేయని రోజుల్లో కూడా ట్రేడింగ్‌కి అనుమతించారు. అయితే, సాధారణంగా ట్రేడింగ్, సెటిల్‌మెంట్ ఒకేరోజు జరిగే టీ+0 సెషన్‌కు మాత్రం వెసులుబాటు ఉండదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 1న శనివారం మార్కెట్లకు సెలవు కావడంతో అదేరోజు సెటిల్ అయ్యే ట్రేడింగ్‌లు పనిచేయవని పేర్కొంది. బడ్జెట్ డే అనేది ఆర్థిక క్యాలెండర్‌లో అత్యంత ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే యూనియన్ బడ్జెట్ సమయంలో చేసే ప్రకటనలు ఆ ఆర్థిక సంవత్సరం మొత్తం మార్కెట్ ట్రెండ్‌లను, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయి.

Advertisement

Next Story

Most Viewed