- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సమస్యలను పరిష్కరించాలి : నల్లగొండ ఎస్పీ
దిశ, నల్లగొండ క్రైం: ప్రజా సమస్యలను పోలీసులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 45 మంది అర్జీదారులతో మాట్లాడి, ఫిర్యాదులను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సందర్భంగా మాట్లాడుతూ బాధితుల సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని, పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలని అన్నారు. ఎవరైనా చట్టవ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బాధితులతో ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.