సోదర భావంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి : మిర్యాలగూడ ఎమ్మెల్యే

by Aamani |
సోదర భావంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలి :  మిర్యాలగూడ ఎమ్మెల్యే
X

దిశ, మిర్యాలగూడ : కుల మతాలకు అతీతంగా సోదర భావంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలో పలు చర్చిలలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ సోదరుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఎస్పీ రాజశేఖర్ రాజు, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ముండ్ల గిరి కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed