Arvind Kejriwal: ఎజెండా లేదు.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేడు.. కాషాయ పార్టీపై కేజ్రీవాల్ విమర్శల

by Shamantha N |   ( Updated:2024-12-23 11:02:53.0  )
Arvind Kejriwal: ఎజెండా లేదు.. ముఖ్యమంత్రి అభ్యర్థి లేడు.. కాషాయ పార్టీపై కేజ్రీవాల్ విమర్శల
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీపై బీజేపీకి(BJP) ఎలాంటి విజన్ లేదని ఆమ్ఆద్మీపార్టీ (Aam Aadmi Party) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కేజ్రీవాల్ ని విమర్శించడమే కాషాయ పార్టీ ఏకైక ఎజెండా అని విమర్శలు గుప్పించారు. మహిళా సమ్మాన్ యోజన కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన ఆప్(AAP) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. “ ఢిల్లీ విషయంలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు. వారికి ఇంతవరకు సీఎం అభ్యర్థి కూడా లేరు. నన్ను ఎలా వేధించాలో మాత్రమే బీజేపీకి తెలుసు’’ అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా బీజేపీ ఛార్జిషీటుపై విమర్శలు గుప్పించారు. "ఢిల్లీలో ఏడుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు. శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తూంటే.. చట్టాలను ఎందుకు అమలు చేయట్లేదు?" అని విమర్శలు గుప్పించారు. బీజేపీ 'ఛార్జిషీట్'పై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా స్పందించారు. "ఢిల్లీ పౌరులకు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి బాగా తెలుసు. భారతీయ జూటా పార్టీ అబద్ధాలతోనే రాజకీయాలు చేస్తుంది" అని కాషాయ పార్టీపై చురకలు అంటించారు.

ఛార్జ్ షీట్ లిస్ట్ విడుదల

ఇదిలా ఉంటే.. త్వరలోనే ఢిల్లీ ఎన్నికలు(Delhi elections) జరగనున్నాయి. కాగా.. ఛార్జ్‌షీట్ లిస్ట్‌(ఆరోప్‌ పత్ర) పేరిట ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేసింది. ‘‘ఈ ప్రభుత్వం దేశంలో అత్యంత అసమర్థ పాలన సాగిస్తోంది. అందరికీ ఉచిత నీరు అని వారు చెప్పారు. కానీ ప్రజలు మాత్రం ట్యాంకర్లకు వేలకువేలు చెల్లించాల్సి వస్తోంది. నగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామన్నారు. కానీ వాయు నాణ్యత ఏ స్థాయిలో ఉందో చూడండి. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. కానీ వారి మంత్రులే జైలుకు వెళ్లారు’’ అని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్ తీవ్ర విమర్శలు చేశారు. ‘‘కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రభుత్వం యమునానదిని కాలుష్యమయంగా మార్చడంతో అక్కడ పండగలు చేసుకోవడం కూడా కుదరడం లేదు. కేజ్రీవాల్‌జీ మీరు ఆ నదిలో పవిత్ర స్నానం చేస్తా అన్నారు. ఆ సమయం వచ్చిందా మరి? మహిళ భద్రత గురించి పట్టించుకోవట్లేదు. నిర్భయ నిధులను ఎందుకు వాడలేకపోతున్నారు?’’ అని ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సమయంలో కేజ్రీవాల్ స్పందించారు.

Advertisement

Next Story