Mahabubabad: బాలికలకు ఫోన్ లో అసభ్య వీడియోలు.. కీచక టీచర్‌కు దేహశుద్ది

by Ramesh Goud |
Mahabubabad: బాలికలకు ఫోన్ లో అసభ్య వీడియోలు.. కీచక టీచర్‌కు దేహశుద్ది
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులకు పాఠాలు నేర్పాల్సిన గురువులే(Teachers) కీచకులుగా మారి విద్యార్థినిలను వేదింపులకు(Harassing) గురి చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్నారులను ప్రయోజకులను చేయాల్సింది పోయి.. కొందరు టీచర్లు వారితో చెడుగా ప్రవర్తించి, గురువు అనే పదానికి మాయని మచ్చ తెస్తున్నారు. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District సీరోల్ మండలం(Seerol Mandal) సక్రం నాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో(Sakram Nayak Thanda Primary School) చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో ఓ కీచక టీచర్ విద్యార్థినిలతో అసభ్యంగా(Behaving Indecently) ప్రవర్తిస్తున్నాడు. విద్యార్థినిలకు తన ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు(Indecent videos) చూపిస్తున్నాడని బాలికలు వాపోతున్నారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ టీచర్ స్కూల్ లో ఉన్న సమయంలో వచ్చి దేహశుద్ది చేశారు. ఈ క్రమంలో ఓ బాలిక తల్లి ఆ కీచకుడిని చెప్పుతో కొట్టింది. అనంతరం తల్లి దండ్రులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Next Story