Manchu Family Issue : మంచు కుటుంబంలో మరోసారి గొడవలు

by M.Rajitha |
Manchu Family Issue : మంచు కుటుంబంలో మరోసారి గొడవలు
X

దిశ, వెబ్ డెస్క్ : మంచు కుటుంబంలో మరోసారి గొడవలు రేగాయి. మంచు విష్ణు(Manchu Vishnu)పై మంచు మనోజ్(Manchu Manoj) మళ్ళీ పహాడీషరీఫ్‌ పోలీసులకు(PahadisharIf PS) ఫిర్యాదు చేశారు. తనకు విష్ణు నుంచి ప్రాణహాని ఉందని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వినయ్ అనే వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. మొత్తంగా 7 అంశాలకు సంబంధించిన 7 పేజీల ఫిర్యాదు కాపీని మనోజ్ పోలీసులకు అందజేశారు. అయితే ఇటీవల మంచు మోహన్ బాబు(Mohanbabu) కుటుంబంలో గొడవలు తీవ్ర స్థాయికి చేరాయి. మోహన్ బాబు, మనోజ్ పోలీసులకు పరస్పరం ఫిర్యాదుచేసుకున్నారు. ఆ వివాదంలో మోహన్ బాబు ఓ జర్నలిస్ట్ పై దాడి చేయగా ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది. రాచకొండ సీపీ సుధీర్ బాబు(Rachakonda CP SudheerBabu) వీరందరిని పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి మనోజ్ విష్ణుపై ఫిర్యాదు చేసి.. కయ్యానికి కాలు దువ్వారు.

Advertisement

Next Story

Most Viewed