దిశ ఎఫెక్ట్…స్పందించిన హైడ్రా అధికారులు

by Kalyani |
దిశ ఎఫెక్ట్…స్పందించిన హైడ్రా అధికారులు
X

దిశ, బడంగ్ పేట్​ : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో ఆక్రమణకు గురైన ఓపెన్​ స్థలాలు అంటూ 'దిశ' దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు హైడ్రా అధికారులు స్పందించారు. ఈ నెల 9వ తేదీన పేదలకు శిక్ష పెద్దలపై ప్రేక్షక పాత్ర ... బడంగ్ పేట్​లో టౌన్​ ప్లానింగ్​ అధికారుల పై ఆరోపణలు ...ఇందిరమ్మ ఇంటి స్థలంలో నిర్మించిన షెడ్డు కూల్చివేత... పట్టా భూమిలోనే నిర్మిస్తున్నా లెక్కచేయని టౌన్​ ప్లానింగ్​ సిబ్బంది... 30వ డివిజన్​ లో 153గజాలు మాయం అంటూ 'దిశ' దిన పత్రికలో కథనం ప్రచురితమయ్యింది. అలాగే ఈ నెల 17వ తేదీన మున్సిపల్​ స్థలంలో అపార్ట్​ మెంట్లు .... రెండు భారీ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు... 2200 గజాల ఓపెన్​ ల్యాండ్​లో నిర్మాణం... 2018లో సూచిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు... ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికార యంత్రాంగం అంటూ 'దిశ' దినపత్రికల్లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి.

దీంతో బీజేపీ బడంగ్ పేట్​ కార్పొరేషన్​ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్​ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డిలు 'దిశ' పత్రికలో వచ్చిన కథనాల ప్రతిని కూడా జత పరుస్తూ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ​ హైడ్రా ఇన్​స్పెక్టర్​ తిరుమలేష్​​ ఆధ్వర్యంలో సోమవారం బడంగ్ పేట్​ కార్పొరేషన్​ పరిధిలోని నాదర్​గూల్​ విలేజ్​ మున్సిపల్​ కాలనీలోని సర్వేనెంబర్​ 743, 747, 748, 749, 750 లలో కబ్జాకు గురైన 5100 గజాల ఓపెన్​ స్థలం తో పాటు , మారుతీనగర్​లోని సర్వే నెంబర్​ 79,80లలోని 2188 గజాలలో ఆక్రమణకు గురైన ఓపెన్​ స్థలాన్ని గాయత్రీ హిల్స్​లోని సర్వే నెంబర్​ 787, 788, 789, 790లలో కబ్జాకు గురైన పార్కు ప్రదేశాన్ని, సర్వేనెంబర్​ 119లో అక్రమ కట్టడాల ప్రాంతాన్ని, అయోధ్య నగర్​లోని సర్వేనెంబర్​ 75 /1 లోని ఆక్రమణకు గురైన పార్క్​ స్థలం, సర్వే నెంబర్​ 58,59,60లలోని ఇరిగేషన్​ నాలాను అక్రమించి నిర్మించిన ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు ఎప్పటి నుంచి కబ్జాకు గురయ్యాయి? ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి? కబ్జాకు పాల్పడిందెవరు? అని హైడ్రా అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ చేపట్టిన అనంతరం హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు నివేదికను అందజేస్తామని, ఆపై అక్రమార్కులపై చర్యలు చేపడతామని హైడ్రా ఇన్​స్పెక్టర్​ తిరుమలేష్​ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed