- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజావాణి విన్నపాలను వెంటనే పరిష్కరించాలి : సూర్యాపేట కలెక్టర్
దిశ,సూర్యాపేట కలెక్టరేట్ : సోమవారం కలెక్టర్ సమావేశ మందిరం నందు జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అందించిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డి రాంబాబుతో కలిసి స్వీకరించారు. ఈరోజు ప్రజావాణిలో మొత్తం 94 దరఖాస్తులు రాగా శాఖ లవారీగా దరఖాస్తులను అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రయాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో వారికి తగు వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు.
త్వరలో రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు కొరకు జనవరి లో డ్రా తీయటానికి అధికారులు తమ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో జరిగే పెద్దగట్టు జాతర కి సంబంధిత శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు కొన్ని శాఖలకు చెందిన అధికారులు తమ నివేదికను అందజేయలేదని రేపటికల్లా పూర్తి నివేదికను అందజేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ సతీష్ కుమార్, డి ఆర్ డి ఓ అప్పారావు, dtdo శంకర్, సీపీఓ ఎల్ కిషన్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్ ,పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ ,డి ఈ ఓ అశోక్, డి డబ్ల్యు ఓ నరసింహారావు, కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.