కత్తిపోట్ల కలకలం.. కత్తులతో యువకుల వీరంగం..

by Aamani |
కత్తిపోట్ల కలకలం.. కత్తులతో యువకుల వీరంగం..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో కత్తులతో యువకులు వీరంగం సృష్టించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని జిరాయత్ నగర్ లో యువకుల కత్తిపోట్ల కలకలం రేపాయి. ఆర్మూర్ మున్సిపల్ లోని పెర్కిట్ ఏరియా కు చెందిన షేక్ తాహిర్ ఫై జిరాయత్ నగర్ కు చెందిన యువకులు కత్తులతో దాడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.

జిరాయత్ నగర్ కు చెందిన షాహిద్, వాజీర్, షేక్ లు పలువురు యువకులతో వచ్చి కత్తిపోట్లు విచారని, వారితో 30 మంది యువకులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కత్తిపోట్లకు గురైన బాధితులని ఆర్మూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మరింత మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కత్తులతో దాడి చేసిన యువకులపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ సోమవారం తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed